ప్రియుడితో హాట్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్... 40 ఏళ్ల వ‌య‌స్సులో?

by velandi.Saikiran |

యాక్టింగ్ కోచ్ అయిన రచిత్‌ సింగ్ తో హుమా ఖురేషి దాదాపు సంవత్సరం నుంచి డేటింగ్ లో ఉన్నారట.

ప్రియుడితో హాట్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్... 40 ఏళ్ల వ‌య‌స్సులో?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో హుమా ఖురేషి ( Huma Qureshi ) ఒకరు. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా ఈ బ్యూటీ మెరిసి అందరిని ఆకట్టుకుంది. అలాంటి ఈ అందాల తార... ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హుమా ఖురేషి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రచిత్‌ సింగ్ తో ( Rachit Singh) నటి హుమా ఖురేషి ఎంగేజ్మెంట్ జరిగిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్‌ సింగ్ తో హుమా ఖురేషి దాదాపు సంవత్సరం నుంచి డేటింగ్ లో ఉన్నారట. యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలోనే అతనితో పరిచయం ఏర్పడిందట. ఇక వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్త బయటకు వచ్చింది. దాదాపు 40 సంవత్సరాలు ఉన్న హుమా ఖురేషి... శిఖర్ ధావన్ తో రిలేషన్ లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆమె అసలు బాయ్ ఫ్రెండ్ రచిత్‌ సింగ్ అని.. అతన్ని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని... ఇప్పుడు మరో విషయం బయటపడింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story