కాజల్ నుంచి భారీ లేడీ ఓరియంటెడ్‌ మూవీ

by Disha Web Desk 7 |
కాజల్ నుంచి భారీ లేడీ ఓరియంటెడ్‌ మూవీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌.. పెళ్లి, పిల్లలు అంటూ ఇండస్ర్టీకి చాలా గ్యాప్ ఇచ్చింది. దీంతో అందరూ ఇక కాజల్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌‌గా ‘భగవంత్ కేసరి’తో మంచి విజయం అందుకున్న ఈ చందమామ.. దీంతోపాటు మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక తాజాగా కొత్త దర్శకుడు ఈ అమ్మడుతో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కాజల్‌కు దాదాపుగా మూడు కోట్ల పారితోషికం ఇవ్వడంతోపాటు, ఈ మూవీపై రూ.50 కోట్ల బడ్జెట్‌‌ఖర్చు చేస్తారట. కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్‌ ప్రారంభించి, ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Read More..

బికినీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన గుప్పెడంత మనసు నటి జగతి.. పోస్ట్ వైరల్


Next Story

Most Viewed