సూపర్ స్టార్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ‘కూలీ’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’.

సూపర్ స్టార్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. ‘కూలీ’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన  లోకేష్ కనగరాజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో చిందులేయనుంది. అలాగే ఇందులో శృతి హాసన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేశాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన 'మోనికా మై డియర్ మోనికా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ముఖ్యంగా 'మోనికా' సాంగ్‌లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde)తో మలయాళ స్టార్ సౌబిన్ సాహిర్ స్టెప్పులు అదిరిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్ తెలిపాడు. ‘‘కూలీ కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఇందులో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. రజినీకాంత్ సర్ యాక్షన్‌ను చూపిస్తుంది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ఇందులో నటించిన హీరోల లుక్స్ రివీల్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒక్క ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా.

దాన్ని ఆగస్టు 2న రిలీజ్ చేయాలనుకుంటున్నాము. అయితే ఇందులో నటించేందుకు నాగార్జున సర్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ నటించని పాత్రలో కనిపిస్తారు. అయన్ను ఒప్పించేందుకు నాకు చాలా సమయం పట్టింది. ఓ పాత్ర కోసం కోసం ఫహాద్ ఫాజిల్‌ను అనుకున్నా కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు 2 అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘కూలీ’ ట్రైలర్ రాబోతున్నట్లు తెలుసుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనడంలో అతిశయోక్తి లేదు.

Next Story