ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘దేవర’ అప్డేట్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడే! (పోస్ట్)

by Disha Web Desk 6 |
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘దేవర’ అప్డేట్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడే! (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న చిత్రం ‘దేవర’. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా రెండు బాగాలు రానుంది. 2024 అక్టోబర్ 10న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఫ్యాన్స్ దేవర నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా? అని అతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, మేకర్స్ దేవర అప్డేట్ ఇస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. తొందరలో దేవర ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు రాసుకొచ్చారు. అంతేకాకుండా సెలబ్రేషన్స్, కేక్ ఎమోజీలను కూడా షేర్ చేశారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పోస్ట్ చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed