సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’.. (ట్వీట్)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే(Chunky Pandey) తనయుడు ఆహాన్ పాండే (Ahaan Pandey)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’.. (ట్వీట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు చుంకీ పాండే(Chunky Pandey) తనయుడు ఆహాన్ పాండే (Ahaan Pandey)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అనీత్ పద్దా (Aneeth Padda)హీరోయిన్‌గా నటించగా.. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ‘సైయారా’(Saiyaara) జులై 18న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎంతో మంది సినీ సెలబ్రిటీలను మంత్రముగ్ధులను చేసింది. దీనిపై స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో అంతా కొత్త నటీనటులు అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఓ సంచలన విషయాన్ని సాధించడమే కాక పలు రికార్డులు బ్రేక్ చేసింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రియులు, సెలబ్రిటీలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సినీ సెలబ్రిటీలకు మంత్రముగ్దులను చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఈ మూవీ నెలరోజులకే ఓటీటీలోకి రాబోతుంది. దీని హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 12న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story