- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘కుబేర’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కుబేర’(Kubera).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, అజయ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న థియేటర్స్‌లోకి వచ్చి మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినీ ప్రియులను మెప్పించడంతో పాటు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక ఇందులో ధనుష్ బిచ్చగాడిలా నటించి అందరినీ మంత్రముగ్దులను చేసి 100 మార్కులు కొట్టేశాడు. ఇందులోని పాటలు, పలు డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘కుబేర’ స్ట్రీమింగ్ డేట్‌పై ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. జూలై 18 నుంచి తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు సంతోష పడుతున్నారు.






