మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)- సతీమణి ఉపాసన(Upasana) దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)- సతీమణి ఉపాసన(Upasana) దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలామంది పేద ప్రజలకు సాయం చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు అందరి దృష్టిన ఆకర్షిస్తున్నారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2023లో జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మినివ్వగా.. ఆ పాపకు క్లిన్ కారా అని నామకరణం చేశారు. కానీ పుట్టి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా ముఖాన్ని మాత్రం చూపించలేదు. మెగా అభిమానులు ఎంత బతిమిలాడినా తన బిడ్డ ముఖాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. అయినప్పటికీ మెగా ప్రిన్సెస్‌ను చూసేందుకు నెటిజన్లు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన రెండో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి రియాక్ట్ అయింది.

‘‘మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం చేశాం. దాదాపు 11 ఏళ్ల తర్వాత తల్లిని కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో నాకు ఒత్తిడిగా అనిపించింది. అయినా వాటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా చేయకూడదని అనుకుంటున్నాను. సెకండ్ చైల్డ్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సంతోష పడుతున్నారు. కాగా.. ఇటీవల మెగా హీరో, రామ్ చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ తండ్రి అయిన విషయం తెలిసిందే. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉపాసన తన రెండో బిడ్డ గురించి మాట్లాడటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా అయిపోయింది.

Next Story