ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ‘వార్-2పై’ హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 6 |
ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ‘వార్-2పై’ హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: నేడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్ 9999. మీకు సంతోషకరమైన రోజు. రాబోయే సంవత్సరంలో పూర్తి యాక్షన్‌ ప్యాక్‌తో సాగాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. మనం కలిసే వరకు మీకు ప్రతి రోజూ ఆనందం శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ రాసుకొచ్చారు. అయితే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘వార్-2’ సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా, హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌తో తన ఉగ్ర రూపాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది 5న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హృతిక్ రోషన్ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్‌కు కన్ఫమ్ అయినట్లు అయ్యింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more:

బ్రేకింగ్: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు Jr. NTR దూరం.. కారణం ఇదే!




Next Story

Most Viewed