మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో హృతిక్

by Disha Web Desk 7 |
మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో హృతిక్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా తన అప్‌కమింగ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ 'విక్రమ్ వేద' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనాడు. అయితే ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. ఓ అభిమాని హృతిక్‌ను సెల్ఫీ అడుగుతూ ఆయన పాదాలు తాకాడు. ఆ వెంటనే హృతిక్ కూడా అభిమాని పాదాలను తాకి, అతనితో ఆప్యాయంగా ఫొటో దిగి సింప్లిసిటీ చాటుకున్నాడు. అంత పెద్ద హీరో తిరిగి అభిమాని పాదాలు తాకాడంటే తనది ఎంత మంచి మనసో ఇక్కడే అర్థమవుతోంది. అందుకే హృతిక్ చేసిన పనికి ఇంప్రెస్ అయిన అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.



Next Story

Most Viewed