- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్’ మూవీపై హృతిక్ రోషన్ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్లు రియాక్షన్ ఇదే
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), సారా అర్జున్ జంటగా నటించిన సినిమా ‘ధురంధర్’(Dhurandhar).

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), సారా అర్జున్ జంటగా నటించిన సినిమా ‘ధురంధర్’(Dhurandhar). ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. అలాగే సినీ సెలబ్రిటీల ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే ఈ మూవీపై సినీ స్టార్స్ పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘ధురంధర్’ రివ్యూ ఇచ్చారు. అయితే ఈ పోస్టులో ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదంగా మారాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు హృతిక్ రోషన్(Hrithik Roshan)పై విమర్శలు చేస్తున్నారు. అసలు ఆయన పోస్టులో ఏముందంటే.. ‘‘నాకు ‘ధురంధర్’ సినిమా చాలా నచ్చింది. హృదయానికి హత్తుకునేలి తీర్చిదిద్దిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందించారు. అయితే ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను. కానీ దర్శకులు కొన్ని విషయాలపై బాధ్యాతయుతంగా వ్యవహరించాలి కాబట్టి అలా రూపొందిచారని నేను అనుకుంటున్నాను.
ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఈ చిత్రాన్ని ఆస్వాదించాను. దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ధురంధర్’ కేవలం పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని చూపారని, భయంకరమైన దాడులను చూపిన విధానాన్ని ఎందుకు అంగీకరించలేకరపోతున్నారని హృతిక్ రోషన్‌ను ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోబోయే క్రమంలో హృతిక్ వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.






