Hrithik Roshan: 'జోధా అక్బర్'కు 15 ఏళ్లు.. హృతిక్ ఎమోషనల్ నోట్ వైరల్!

by Disha Web Desk 10 |
Hrithik Roshan: జోధా అక్బర్కు 15 ఏళ్లు.. హృతిక్ ఎమోషనల్ నోట్ వైరల్!
X

దిశ, సినిమా: భారతీయ చారిత్రక నాటకం 'జోధా అక్బర్' 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృతిక్ రోషన్‌ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ఈ పీరియాడికల్ డ్రామాను తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్‌ బర్త్ డే కూడా కావడంతో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ మూవీలో కింగ్ అక్బర్ పాత్రలో నటించి ఔరా అనిపించిన హృతిక్.. ''జోధా అక్బర్‌'లో భాగమైనందుకు, నాపై నమ్మకముంచి గొప్ప బాధ్యతను అప్పగించినందుకు అశుతోష్‌కు ధన్యవాదాలు. అతని దర్శకత్వాన్ని నాతోపాటు సహనటులు ఎప్పటికీ ఉన్నతంగా ఆదరిస్తారు. ఈ హిస్టారికల్ పీరియడ్ డ్రామాను విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న #15years Of JodhaaAkbarలోని డైలాగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి' అంటూ ఆనంద క్షణాలను గుర్తుచేసుకున్నాడు హృతిక్.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed