'Pathaan' చూసి రివ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్

by Disha Web Desk 10 |
Pathaan చూసి రివ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణే జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరక్కెకిన చిత్రం 'పఠాన్'. అనేక వివాదాల మధ్య ఎట్టకేలకు నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతంచేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక మూవీ చూసిన బాలీవుడ్ నటులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. రీసెంట్ ఈ మూవీని వీక్షించిన హృతిక్ రోషన్ ట్వీట్టర్ వేదికగా సాలిడ్ రివ్యూ ఇచ్చారు. 'సినిమాలో ఊహించని సీన్స్ ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్, ట్విస్ట్‌లు, మ్యూజిక్, స్క్రీన్‌ప్లే, సర్ప్రైజ్‌లతో సిదర్థ్ నువ్వు మళ్లీ విజయం సాధించావ్ కంగ్రాట్స్ షారుఖ్, దీపికా, అండ్ మూవీ టీం' అంటూ రాసుకొచ్చాడు.

Also Read...

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న '18 Pages'!

మహేష్ బాబుగారి ప్రశంస ఎప్పటికి మర్చిపోలేను: Suhas



Next Story

Most Viewed