స్వాత్రంత్య్ర సమరయోధురాలిగా హాట్ యాంకర్ అనసూయ.. న్యూ లుక్‌కు నెటిజన్లు ఫిదా!

by Disha Web Desk 7 |
స్వాత్రంత్య్ర సమరయోధురాలిగా హాట్ యాంకర్ అనసూయ.. న్యూ లుక్‌కు నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి సుపరిచితమే. తరచూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంటుంది. ఈ భామపై ఎవరైనా ట్రోల్స్ చేస్తే వెంటనే ఇచ్చిపడేస్తుంది. ప్రస్తుతం ఈ యాంకర్ వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. షూటింగ్‌లో ఏ మాత్రం విరామం దొరికినా అనసూయ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ నటి.. స్వాతంత్రోద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిన బేగం హజ్రత్‌ను గుర్తు చేసుకుంటూ తన గురించి ట్విటర్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది.

‘‘బ్రిటీష్ పాలనను సవాల్ చేయడానికి బేగం హజ్రత్ రెండు దశాబ్దాల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ ఇండిపెండెంట్‌ డే సందర్భంగా వారి ధైర్యం, నిబద్ధతతో మనకు స్ఫూర్తినిచ్చే బేగం హజ్రత్‌ మహల్‌ వంటి మరచిపోయిన వీరులను స్మరించుకుని సెలబ్రేట్‌ చేసుకుందామని అనసూయ రాసుకొచ్చింది. అలాగే ఈ హాట్ యాంకర్.. బేగం హజ్రత్‌ గెటప్‌లో దిగిన ఓ ఫొటోను నెట్టింట షేర్ చేసింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు లుక్‌ మాదిరిగా ఈ పిక్‌లో అనసూయ రెడీ అయ్యింది. ప్రస్తుతం అనసూయ న్యూ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.



Next Story