RRRని 'బాలీవుడ్ చిత్రం'గా పిలిచిన ఆస్కార్‌లో హోస్ట్.. తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

by Disha Web Desk 12 |
RRRని బాలీవుడ్ చిత్రంగా పిలిచిన ఆస్కార్‌లో హోస్ట్.. తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
X

దిశ, వెవ్‌డెస్క్: 95వ ఆస్కార్ వేడుకల్లో భారత్ కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇందులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి RRR నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. కాగా ఈ అవార్డుల కార్యక్రమంలో హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ 'నాటు నాటు' పాట ప్రదర్శన సందర్భంగా SS రాజమౌళి RRRని "బాలీవుడ్ చిత్రం" అని పిలిచారు. దీంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా కిమ్మెల్ ను విమర్శించడమే కాకుండా.. అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే దీనిపై.. RRR భారతీయ చిత్రం/ తెలుగు/ టాలీవుడ్ చిత్రం, బాలీవుడ్ చిత్రం కాదు." అని చెప్పుకొచ్చాడు. అలాగే మరో అభిమాని.. "ఇలా అనడం ఆస్కార్ అకాడెమీకి అవమానం".. అన్ని అన్నాడు.

Read more:

‘నాటు నాటు’పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు

Next Story

Most Viewed