Oppenheimer OTT : హాలీవుడ్ ‘ఓపెన్ హైమర్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ లాక్.!

by Dishafeatures1 |
Oppenheimer OTT : హాలీవుడ్ ‘ఓపెన్ హైమర్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ లాక్.!
X

దిశ, సినిమా: హాలీవుడ్‌ బ్లాక్‌బ‌స్టర్ మూవీ ‘ఓపెన్‌హైమ‌ర్’ ఎలాంటి విజయం సాదించిందో చెప్పకర్లేదు. దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ఈ మూవీ ని .. అణుబాంబును క‌నిపెట్టిన శాస్త్రవేత్త ఓపెన్‌హైమ‌ర్ జీవిత కథ ఆధారంగా రూపొందించాడు. గత ఈ ఏడాది జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఓపెన్‌హైమ‌ర్ గా సిలియాన్ మ‌ర్ఫీ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా గత ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ ‘ఓపెన్‌ హైమర్‌’.. ఇటివల ప్రక‌టించిన 77వ బ్రిటీష్ అకామెడీ ఫిల్మ్ అవార్డ్స్‌లో (బాఫ్టా) ఏకంగా ఏడు అవార్డుల‌ను గెలుచుకుంది. బాఫ్టా చ‌రిత్రలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రాల్లో ఒక‌టిగా ఈ సినిమా నిలిచింది.

ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోయింది.. థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కాగా మార్చి 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో భాగంగా జియో సినిమా అఫీషియ‌ల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేస్తూ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, ద‌క్షిణాది భాష‌ల్లో ఓపెన్‌హైమ‌ర్ స్ట్రీమింగ్ ఉండ‌బోతున్నట్లు తెలిపింది. అయితే ప్రీమియ‌ర్ క‌స్టమ‌ర్స్ మాత్రమే ఈ మూవీని జియో సినిమా ఓటీటీలో వీక్షించ‌వ‌చ్చు.



Next Story