- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్.. శ్రీకాంత్ ఓదెల ప్లాన్ మామూలుగా లేదుగా!
నేచురల్ స్టార్ నాని (nani) మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise)లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani) మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise)లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ గ్లింప్స్ తో అంచనాలని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళింది.
తాజా సమాచారం ప్రకారం.. ది ప్యారడైస్ కోసం టీం హాలీవుడ్‌లోని #ConnekktMobScene ఎగ్జిక్యూటివ్ VP ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని కలసి సినిమా కోసం కొలాబరేషన్ డిస్కస్ చేస్తున్నట్లు టాక్. ఇంటర్నేషనల్ వెర్షన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్ ని కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి టీం చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాని అభిమానులు ఈ సారి శ్రీకాంత్ గట్టిగానే ప్లా్న్ చేస్తున్నాడు.. ఊహించని సర్‌ప్రైజ్‌ల కోసం వేచి ఉండలేకపోతున్నామని అంటున్నారు. కాగా.. ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.






