- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. ‘లాలా అమర్‌నాథ్’ బయోపిక్‌కు రంగం సిద్ధం!
భారత క్రికెట్ లెజెండ్ లాలా అమర్ నాథ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఆమిర్ - అశుతోష్ సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా ‘లగాన్’. ఆమిర్ ఖాన్ హీరోగా, అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లి మన సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత, ఈ క్రేజీ కాంబోలో ఓ మూవీ రాబోతుందన్న వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. సమాచారం ప్రకారం.. భారత క్రికెట్ లెజెండ్ లాలా అమర్ నాథ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఆమిర్ - అశుతోష్ సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఒక క్రీడాకారుడి కథ మాత్రమే కాదు, 1947 నాటి దేశ విభజన నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా. దేశం ముక్కలవుతున్న సమయంలో చోటుచేసుకున్న అల్లకల్లోల పరిస్థితులు, ఆ భయానక వాతావరణం లాలా అమర్ నాథ్ వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనేది ఈ సినిమాలో అత్యంత హృద్యంగా చూపించబోతున్నారట.
గత కొంతకాలంగా ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. దీంతో తనకి ‘లగాన్’ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన అశుతోష్ గోవారికర్‌తో మళ్లీ చేతులు కలపడం ఆమిర్ తీసుకున్న తెలివైన నిర్ణయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘లగాన్’ కూడా పీరియాడిక్ డ్రామాగానే వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ అదే జానర్‌లో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తుండటంతో ఆమిర్ పూర్వ వైభవం అందుకోవడం ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. 1940వ దశకం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






