‘హై’ కొత్త జానర్‌తో రాబోతుంది.. సాయి ప్రయత్నానికి ఫలితం రావాలి

by Mallepaka Hamsa |

హిట్ మేకర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' (high) ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

‘హై’ కొత్త జానర్‌తో రాబోతుంది.. సాయి ప్రయత్నానికి ఫలితం రావాలి
X

దిశ, సినిమా: హిట్ మేకర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' (high)అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు. ఈ టీజర్ ఒక గ్రిప్పింగ్ ఆంథాలజీగా ‘హై’ని అర్థం చేసుకునే నలుగురు వ్యక్తులను ప్రజెంట్ చేసింది. ఒక అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఒకరిని నియమించుకుంటుంది, మరొక వ్యక్తి మద్యంలో తన హై వెతుక్కుంటాడు, మరొక అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడంలో తాను హై ఫీలౌతుంది ఆమె ప్రేమికుడు ప్రమాదకరమైన పందాల కాస్తాడు.

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాలకు పనిచేస్తూ గ్యాప్ లో ఈ షూటింగ్ చేసేవాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ గా నా విషెస్ ఎప్పుడు తనకు ఉంటాయి. ఒక కొత్త జానర్ లో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తీసిన సినిమా ఇది. ఆడియన్స్ చూసిన తర్వాత తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు’’ అని అన్నారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి అనిల్ రియల్ ట్రూ ఫ్రెండ్స్. వెంకటేష్ తో సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూశాను. సాయి చాలా పాషన్ పర్సన్. తన ప్రయత్నం తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. అందరికి బెస్ట్ చెప్పారు.

Next Story