- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సుమతీ శతకం’ నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్(Amar Deep) ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్(Amar Deep) ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే పలు షోస్‌లోనూ పాల్గొని ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా తన పాపులారిటీని పెంచుకున్నాడు. ప్రస్తుతం అమర్ దీప్ ‘సుమతీ శతకం’ (Sumathi Satakam)సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సైలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ గారి సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. నాయుడు(M.M. Naidu) దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, చిత్రబృందం హీరో పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలు పెంచారు.
అమర్ దీప్ ఇందులో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంది. అమర్ దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు, ఆ బ్యాక్ గ్రౌండ్ వాతావరణం, ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిశలు కష్టపడుతోంది.






