- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా రామ చిలుక వచ్చేస్తోంది.. ‘మోగ్లీ’ నుంచి హీరోయిన్ హాట్ లుక్ రిలీజ్
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా మారి వరుస సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు.

దిశ, సినిమా: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా మారి వరుస సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ‘మోగ్లీ’ (Mowgli )మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాక్షి మడోల్కర్(Sakshi Mhadolkar) టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. పలు బ్రాండ్స్ యాడ్స్‌లో కనిపించిన ఈ అమ్మడు రోషన్ కనకాలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
నేడు సాక్షి పుట్టిన రోజు కావడంతో మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ విష్ చేశారు. ‘‘మా రామ చిలుక మీ ముందుకు వచ్చేస్తోంది. గార్జియస్ జాస్మిన్‌కు పుట్టిన శుభాకాంక్షలు. మోగ్లీతో ఆమెకు చిరస్మరణీయమైన ఎంట్రీ కాబోతుంది’’ అని రాసుకొచ్చారు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో సాక్షి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబోలో ఉన్న చీరను కట్టుకుని నగలు ధరించి స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకున్న ఆమె నడుము చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అమ్మడు హాట్ లుక్ కుర్రాళ్లలో చెమటలు పట్టేలా చేస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మోగ్లీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






