స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు.. మాళవిక మోహనన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు..  మాళవిక మోహనన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab). హారర్ కామెడీ బ్యాక్‌డ్యాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్‌లో రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను ప్రభాస్, కార్తి వంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నా. అందులో తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ మూవీ చేశా.

ఇది షూటింగ్ పూర్తిచేసుకుని పొంగల్ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం చాలా ఎక్జైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఇందులో నాలా పాత్ర చాలా బాగుంటది. స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్లకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఐదారు సీన్స్, ఒక పాట మాత్రమే ఉంటుంది. ఒకవేళ రెండు పాటలు ఉంటే మాత్రం ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా జరగదు. ‘రాజాసాబ్’ కూడా నాకు ఐదారు సీన్స్, ఓ పాట ఉంటుందని అనుకున్నా. కానీ ఇందులో నాకు గొప్ప పాత్ర దొరికింది.

కథానాయికకు నాకు ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఒక పజిల్‌లాంటింది. మనకు పెద్ద బడ్జెట్, స్టార్ హీరో, డైరెక్టర్ చిత్రాల్లో చాన్స్ దొరకాలంటే చాలా కష్టపడాలి. ఒకవేళ వచ్చినా.. అందులో మన ప్రాధాన్యత ఎంత, మన క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. దొరకపోయినా వచ్చిన పాత్రలతో సంతోషపడాలి. అలా ప్రతిధి మన జీవితంలో ఒక పజిల్ లాంటిదే’’ అని చెప్పుకొచ్చింది.

Next Story