Twinkle Khanna : ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరోయిన్

by Disha Web Desk 7 |
Twinkle Khanna : ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్క సెలబ్రేటిలు ప్రేక్షకులకు, అభిమానులకు చాలా దగ్గరై పొతున్నారు. ముఖ్యంగా అలనాటి నటీనటులు సైతం తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో భార్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. కాగా ఆమె కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

కానీ 2001లో అక్షయ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు దూరమైంది. కాగా తాజాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ట్వింకిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘ఇటీవల చదువుపై ఉన్న ఆసక్తితో లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశా. చదువుకు వయసు అడ్డంకి కాదు. అన్ని విధాలుగా ఎదగాలని అనుకుంటే అందులో ఇది ఒక భాగమే’ అని చెప్పుకొచ్చింది ట్వింకిల్ ఖన్నా.

Read More: చిరంజీవి, ప్రభాస్‌ను క్రాస్ చేసిన సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆమె వెనకే..

Next Story