రాజకీయాల్లోకి ఎంట్రీపై హీరోయిన్ Trisha క్లారిటీ

by Disha Web Desk 10 |
రాజకీయాల్లోకి ఎంట్రీపై హీరోయిన్ Trisha క్లారిటీ
X

దిశ, సినిమా : సీనియర్ నటి త్రిష తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతుందంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాను నటించిన తాజా చిత్రం 'రాంగీ' డిసెంబర్ 30న విడుదలకాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి..రీసెంట్ ఇంటరాక్షన్‌లో క్లారిటీ ఇచ్చింది. 'నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. చిత్రపరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రెండు దశాబ్దాల్లో వాస్తవిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా. విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఇష్యూను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు' అని స్పష్టం చేసింది. ఇక ఈ మధ్య తన పెళ్లి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందన్న ఆమె ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని, అభిమానులు కూడా కొంతకాలం ఓపిక పట్టాలని సూచించింది.

Also Read...

IMBDలో తక్కువ రేటింగ్ వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!

Next Story

Most Viewed