తమిళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. ఫ్యాన్స్‌ను ఎంత కంగారు పెట్టిందంటే?

by Disha Web Desk 9 |
తమిళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. ఫ్యాన్స్‌ను ఎంత కంగారు పెట్టిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సునయన ‘కుమార్ vs కుమారి’ తెలుగు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసు దోచేసింది. తర్వాత ‘సంథింగ్ స్పెషల్’, ‘10th క్లాస్’, ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’, ‘రాజ రాజ చోరా’ వంటి సినిమాల్లో అలరించింది. మరోవైపు తెలుగు వెబ్ సిరీస్‌లు ‘చదరంగం’, ‘మీట్ క్యూట్’లోనూ నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెండు రోజులుగా కనిపించడం లేదని కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. తను కిడ్నాప్ అయ్యిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో సునయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తీరా చూస్తే ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో నెటిజన్లు పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్నారు. అందరినీ కంగారు పెట్టించిన ఈ హీరోయిన్‌తో పాటు చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed