రాజకీయాల్లోకి హీరోయిన్ శృతిహాసన్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

by Disha Web Desk 6 |
రాజకీయాల్లోకి హీరోయిన్ శృతిహాసన్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరో కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అయితే కమల్ హాసన్ మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పెద్ద కూతురైన శృతి హాసన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఎన్నో సార్లు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలు ఆగడం లేదు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్‌ను మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె స్పందించింది. ‘‘ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి నాకు పెద్దగా ఆసక్తి లేదు. సినిమాల్లో నటించడం పైనే నాకు ఆసక్తి ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed