- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్!
హుమా, ఇప్పుడు రచిత్ సింగ్‌తో ఏడడుగులు వేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతా సవ్యంగా సాగితే అక్టోబర్‌లో వీరి వివాహం ఘనంగా జరగబోతోందని టాక్ వినిపిస్తోంది.

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతనిస్తూ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి హుమా ఖురేషి కూడా చేరబోతున్నట్లు సమాచారం. తన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు నెట్టింట వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' వంటి క్లాసిక్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హుమా ఖురేషి, అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘మహారాణి’ వెబ్ సిరీస్‌తో ఆమె సాధించిన స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లి కోసం తన పనికి కాస్త విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా హుమా ఖురేషి, బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ ఈవెంట్లలో, పార్టీలలో కనిపిస్తూ కెమెరా కళ్లకు చిక్కారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే హుమా, ఇప్పుడు రచిత్ సింగ్‌తో ఏడడుగులు వేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతా సవ్యంగా సాగితే అక్టోబర్‌లో వీరి వివాహం ఘనంగా జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి హుమా-రచిత్ జోడీ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతారా? లేక తమ సంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






