Pushpa 2 ఐటమ్ సాంగ్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్..! పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన భామ

by Disha Web Desk 6 |
Pushpa 2 ఐటమ్ సాంగ్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్..! పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన భామ
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప-2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప-2 లో ఐటమ్ సాంగ్‌లో ఎవరు చిందులెయ్యనున్నారనే విషయంపై నెట్టింట ఓ చర్చ జరుగుతుంది. తాజాగా, హీరోయిన్ సీరత్ కపూర్ అల్లు అర్జున్‌కు టైట్ హగ్ ఇచ్చిన ఓ ఫొటోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ డాన్సర్స్‌‌కి ఎగిరేందుకు రెక్కలు అక్కర్లేదు.. వారి ఎనర్జీనే లీడ్ చేస్తుంది” అనే క్యాప్షన్‌ను జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సీరత్ పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో నటిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more:

Naga Chaitanya: సమంతలో నాకు ఆ క్వాలిటీ ఇష్టమంటూ.. చెప్పిన నాగ చైతన్య

'ది కేరళ స్టోరీ' సినిమా‌కు పన్ను మినహాయించిన UP ప్రభుత్వం..


Next Story