ప్రభాస్ శారీ గిఫ్ట్ ఇవ్వ‌డంపై హీరోయిన్ కామెంట్స్ !

by velandi.Saikiran |

ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు

ప్రభాస్ శారీ గిఫ్ట్ ఇవ్వ‌డంపై హీరోయిన్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్ రిద్ది కుమార్ , సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కట్టుకున్న చీరపై చర్చ మొదలైంది. ప్రభాస్ గిఫ్ట్ గా గుర్తించాలని ఆమె పేర్కొంది.

తాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మొదటగా సెట్ కు వెళ్లినట్లు తెలిపారు. ఈ తరుణంలోనే గిఫ్ట్ గా కర్ణుడిపై ఒక పుస్తకం తీసుకువచ్చినట్లు వివరించింది. ఆయన ఆ రోజు రాలేకపోవడంతో, కలవలేకపోయానని తెలిపింది. ఇక దీపావళి పార్టీకి తాను అటెండ్ కాలేకపోయానని వివరించింది. ఆ తర్వాత నేను పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తే, ఆయన తనకు రిటర్న్ గిఫ్ట్ గా చీర ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరో ట్రైలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Next Story