‘RT-76’ సినిమా అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.. ఎనర్జిటిక్‌గా ఉండబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు.

‘RT-76’ సినిమా అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.. ఎనర్జిటిక్‌గా ఉండబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’ ప్రమోషన్స్ చేస్తూనే.. తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. భాను భోగి వరపు దర్శకత్వంలో తెరకెక్కించిన.. ‘మాస్ జాతర’ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ కాకముందే రవితేజ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాస్ మహారాజా, కిషోర్ తిరుమల(Kishore Tirumala)కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ‘RT-76’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, అషికా రంగనాథ్ ‘RT-76’ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. స్పెయిన్‌లో మెలొడీ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు తెలుపుతూ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన ఫొటోలను షేర్ చేసింది. ‘‘సాంగ్ షూట్ ఇదే చివరి రోజు. చాలా ముద్దుగా, ముద్దుగా ఉంది.. ఈ స్పానిష్ అమ్మాయిలు పాటకి చాలా ఎనర్జీని, ఆకర్షణను తీసుకొచ్చారు.

మేము మా స్పానిష్ షెడ్యూల్‌ను ఈ విధంగా ముగించాము. పాటల చిత్రీకరణ చివరి రోజు బృందంతో పిజ్జా పార్టీ చేసుకున్నాం. ఆ పాట చాలా ఎనర్జిటిక్‌గా ఉండబోతోంది’’ అని రాసుకొచ్చింది. త్వరలోనే ఇండియాకు తిరిగొచ్చిన యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే టైటిల్‌ను కూడా రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story