‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:42:17  IST  )

మలయాళ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో అలరిస్తోంది.

‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌తో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమారి, సంజయ్ దత్, యోగిబాబు, మాళవిక, నిధి అగర్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, మాళవిక మోహనన్ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మాళవిక మెగాస్టార్ సరసన నటించబోతున్నట్లు టాక్. బాబీ(Bobby), చిరంజీవి(Chiranjeevi) కాంబోలో వస్తున్న ‘మెగా-158’(Mega-158) సినిమాలో మాళవిక హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ భామకు మూవీ మేకర్స్ సంప్రదించగా.. ఆమె నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా మెగా స్టార్ సరసన కావడంతో వెంటనే ఒకే చేసిందట. ఇక మాళవిక 70 ఏళ్ల హీరోతో నటించేందుకు ఒప్పుకోవడం నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవసరమా నీ ఏజ్‌కి తగ్గ హీరోలతో నటించమని సలహా ఇస్తున్నారు. మరికొందరు బంపర్ ఆఫర్ పట్టేసిందని అంటున్నారు.

READ MORE ....

పవన్ కళ్యాణ్ గురించి అడిగిన నెటిజన్.. వద్దు బ్రో అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ రియాక్షన్!

Next Story