- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో విజయ్ బర్త్ డే వేడుకల్లో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
సౌత్ ఇండియా స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు చెన్నై

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు చెన్నై శివారులోని నీలాంగరైలో శనివారం పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయ్ ఫ్యాన్స్ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ బాలుడితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన దళపతి ఫ్యాన్స్ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
బాణా సంచా పేల్చడం వల్ల జరిగిందా..? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో విజయ్ అభిమానులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దళపతి విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దళపతికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.






