Vijay Devarakonda: వరుసగా 5 ప్లాప్‌లున్న హీరోయిన్‌తో జతకడుతానంటోన్న రౌడీ హీరో

by Kodari Anjali |   (  Updated:2023-06-13 05:21:35  IST  )

సాధారణంగా ఈ హీరోయిన్ అయితే నాకు బాగా సెట్ అవుతుంది.

Vijay Devarakonda: వరుసగా 5 ప్లాప్‌లున్న హీరోయిన్‌తో జతకడుతానంటోన్న రౌడీ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఈ హీరోయిన్ అయితే నాకు బాగా సెట్ అవుతుంది. మా కాంబినేషన్‌లో సినిమా బాగుంటుందని హీరోలు కోరుకోవడం సహజం. అయితే టాలీవుడ్ రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ పరుశరామ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీలో వరుసగా 5 అట్టర్ ప్లాప్స్‌ ఇచ్చిన ‘పూజా హెగ్డే’ ను హీరోయిన్‌గా తీసుకోవాలని విజయ్ భావిస్తున్నాడట. ‘‘ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’’ లాంటి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు ఈ బుట్టబొమ్మ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. అలాగే విజయ్- పూజా హెగ్డే కలిసి నటించిన ‘జనగనమణగ’ సినిమా మధ్యలో ఆగిపోయింది. అయినా కూడా దేవరకొండ ఆమెనే కోరుకుంటున్నాడని సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. .

Also Read..

జాతకం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్‌లను మించి మోక్షజ్ఞ క్రేజ్ సాధించనున్నాడా..?

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. ఏపీలో హై టెన్షన్

Next Story