శ్రీ లీల‌ను అవ‌మానించిన సూర్య‌..స్టేజ్ పైనే దారుణం !

by velandi.Saikiran |

సూర్య తన నెక్స్ట్ హీరోయిన్ గా త‌న‌ను తీసుకోవాల‌నే ప్లాన్ లో భాగంగా రాసుకు పూసుకు తిరుగుతోంద‌ని శ్రీలీల‌ను ట్రోలింగ్

శ్రీ లీల‌ను అవ‌మానించిన సూర్య‌..స్టేజ్ పైనే దారుణం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 24 ఏళ్ల ఈ చిన్నది పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా రవితేజతో నటించిన ధమాకా మంచి హిట్ ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీలో శ్రీలీలకు వరుసగా అవకాశాలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూడా శ్రీలీల మెరిశారు. అలాగే గుంటూరు కారం, పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసి దుమ్ము లేపారు. ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. అలాంటి శ్రీలీలను తమిళ హీరో సూర్య అవమానించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న జరిగింది. ఈ ఈవెంట్ కు సూర్య స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. స్టేజ్ పైన చిత్ర బృందంతో ఫోటోలు దిగాడు హీరో సూర్య. ఈ సందర్భంగా హీరో సూర్య పక్కన నిల్చోని కాస్త క్లోజ్ గా కనిపించే ప్రయత్నం చేసింది శ్రీలీల. తన భుజాలను కూడా సూర్యకు టచ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాగా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సూర్య తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా త‌న‌ను తీసుకోవాల‌నే ప్లాన్ లో భాగంగా రాసుకు పూసుకు తిరుగుతోంద‌ని శ్రీలీల‌ను ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ సూర్య మాత్రం అస్స‌లు ఛాన్స్ ఇవ్వ‌బోను అన్న రేంజ్ లో శ్రీలీలకు దూరంగా జ‌రిగాడ‌ని కూడా అంటున్నారు. నీ వేశాలు నా ద‌గ్గ‌ర న‌డువబోవ‌న్న త‌ర‌హాలో సూర్య వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. క్లిక్

Next Story