మెగాస్టార్ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో శివరాజ్ కుమార్

by Disha Web Desk 10 |
మెగాస్టార్ గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో శివరాజ్ కుమార్
X

దిశ,వెబ్ డెస్క్: కన్నడ హీరో శివరాజ్ కుమార్ మనందరికి సుపరిచితమే. ఎందుకంటే అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. మన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివరాజ్ కుమార్ ఇప్పుడు ఘోస్ట్ అనే కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం శివరాజ్ కుమార్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. తెలుగు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు గురించి అడిగిన ప్రశ్నకు శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూపర్ స్టార్ మహేష్ పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించాడానే చెప్పుకోవాలి. మెగాస్టార్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పాలని అభిమానులు కోరడంతో శివరాజ్ కుమార్ ఒక పోస్ట్ పెట్టాడు.

లెజెండ్ ఎప్పటికీ లెజెండ్ గానే ఉంటారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన నా పట్ల కనబరిచిన ప్రేమ, గౌరవం ఎప్పటికి మరిచిపోలేను. ఆయనపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అంటూ శివరాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియానే షేక్ చేస్తుంది.

Read More: నైట్ పార్టీలో రెచ్చిపోయి మరి డ్రింక్ తాగుతూ విష్ణుప్రియ-రీతూ చౌదరి డ్యాన్సులు (వీడియో)

Next Story

Most Viewed