HERO సిద్దార్థ్ బర్త్ డే.. ఫియాన్సీతో చేసిన సెలబ్రేషన్ ఫొటోస్ వైరల్

by Disha Web Desk 9 |
HERO సిద్దార్థ్ బర్త్ డే.. ఫియాన్సీతో చేసిన సెలబ్రేషన్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అదితి రావు హైదరీ అండ్ హీరో సిద్ధార్థ్ గత కొద్ది కాలం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు మారుమోగాయి. ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మార్చి 27న తెలంగాణలో వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అదితి-సిద్ధార్థ్ వివాహానికి తమిళనాడు నుంచి పురోహితులు హాజరై.. వీరి పెళ్లి తంతును పూర్తి చేశారని వార్తలు వినిపించాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఫ్రెండ్స్ హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా భార్య అదితి రావు హైదరీ ట్విటర్ వేదికన సిద్ధార్థ్‌కు హ్యాపీ బర్త్ డే తెలియజేసింది. సిద్ధు పుట్టిన రోజు సందర్భంగా అదితి రావు పంచుకున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed