కాంగ్రెస్ పాలన నెరవేరని స్కీమ్‌లు.. అమలయ్యే స్కామ్‌లు : మహేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ పాలన నెరవేరని స్కీమ్‌లు.. అమలయ్యే స్కామ్‌లు :  మహేశ్వర్ రెడ్డి
X

దిశ,భైంసా : కాంగ్రెస్ పాలన అంటేనే నెరవేరని స్కీములు..అమలయ్యే స్కాం లా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలో గౌరీ శంకర్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.దేశ ఆర్థిక వ్యవస్థ,పటిష్ట భద్రత చెప్పిన మాటలు నెరవేర్చే తత్వం బీజేపీతోనే సాధ్యమని, కాంగ్రెస్ వాగ్దానాలు ఇవ్వడం తప్ప అవి అమలు పరచడంలో ఎప్పుడు విఫలమే అవుతుందని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సమయాన మళ్లీ హామీలు ఇవ్వడం సిగ్గుచేటని, రామరాజ్య స్థాపన కావాలంటే మళ్లీ కేంద్రంలో మోడీ సర్కార్ రావాలని అన్నారు.

అత్యధిక మెజారిటీ తాలూకాలోనే.. : ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

గతంలో ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంటు స్థానంలో అత్యధిక మెజారిటీ ముదోల్ నియోజకవర్గం నుండే సాధించిందని,దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క లక్ష ముప్పై వేల ఓట్ల కు తగ్గకుండా బీజేపీ ఓటు బ్యాంకు సాధిస్తుందని అన్నారు. కేంద్ర నిధులతో ఇప్పటికే తాలుకాలో అభివృద్ధి పనులు మొదలయ్యాయని అన్నారు. రైతు రుణమాఫీ చేయకుండా హామీలన్నీ గాలికి వదిలేసిన రేవంత్ ప్రభుత్వాన్ని,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని,దేశమంతా ప్రస్తుతం మోడీ హవా కొనసాగుతుందని, 370 ఆర్టికల్,రామ మందిర నిర్మాణం సాధ్యపరిచిన ఘనత బీజేపీ దేనిని అన్నారు.

కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తాం : బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్.

స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అవసరమైతే కేంద్ర నిధులతో తాలుకాని మరింత అభివృద్ధి చేస్తామని బిజెపి ఎంపీ అభ్యర్థి గోడo నాగేష్ అన్నారు. ముదొల్ తాలూకాలో కచ్చితంగా ఒక లక్ష 30 వేల ఓట్లు మెజార్టీ సాధిస్తుందన్న విశ్వాసం నాకు ఉందని అన్నారు. కూటమిగా ఏర్పడిన ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రకటించని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పదాధికారులు,నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

దేగాం గ్రామం నుంచి బీజేపీలో చేరిన మహిళలు

బైంసా మండలంలోని దేగాం గ్రామం నుండి భారీ మొత్తంలో మహిళలు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి,రామారావు పటేల్ చేతుల మీదుగా కండువా వేసుకొని, పార్టీలో చేరారు.

Next Story

Most Viewed