ఆయనతో కలిసి మ్యాచ్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించింది.. హీరో రామ్ చరణ్

by Dishafeatures2 |
ఆయనతో కలిసి మ్యాచ్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించింది.. హీరో రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు హీరో రామ్ చరణ్. ధ్రువ, మగధీర, రంగస్థలం వంటి సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు ఈ మెగా పవర్ స్టార్. తాజాగా RRR మూవీతో పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు. కాగా.. శనివారం హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు నాగార్జున, అఖిల్, నాగచైతన్య, శ్రుతిహసన్ తో పాటు RRR స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ తో కలిసి ఫార్ములా ఈ రేసింగ్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించిందని సచిన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహించడం దేశానికి, రాష్ట్రానికి, హైదరాబాద్ కు గర్వకారణమన్నారు. కాగా మహీంద్ర గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ లో హీరో రామ్ చరణ్ తో కలిసి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ''నాటు నాటు'' సాంగ్ కు స్టెప్పులేశారు.

Next Story

Most Viewed