- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోతో నాని కొత్త సినిమా.. ఇక రచ్చ రచ్చే !
హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన వారిలో న

దిశ, వెబ్ డెస్క్ : హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో చిన్న స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన వారిలో నాని మొదటి వరుసలో ఉంటాడు. రవితేజ లాగా.. ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చాడు. ఇక హీరో నాని ఏ సినిమా చేసిన మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇటీవల హిట్ 3 సినిమాతో నాని మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే అలాంటి హీరో నాని మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అది కూడా గెస్ట్ రోల్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట నాని. తమిళ హీరో కార్తీ.. త్వరలోనే ఓ తమిళ దర్శకుడితో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా సముద్ర నేపథ్యంలో.. అచ్చం దేవర లాగా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో కార్తీ హీరోగా చేయనుండగా నాని గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. మొన్న హిట్ 3 లో కార్తీ కూడా గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు హిట్ 4 లో హీరో కార్తీ... మెరువబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కార్తీ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట నాని.






