‘రంగబలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్ సుమకు షాకిచ్చిన హీరో నాగశౌర్య..

by Disha Web Desk 6 |
‘రంగబలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్ సుమకు షాకిచ్చిన హీరో నాగశౌర్య..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. దీనికి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 7న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుంది. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. ఎప్పటిలాగానే పంచ్‌లు, జోక్స్‌తో సరదా సరదాగా తనదైన శైలిలో మెప్పించింది.

ఆ తర్వాత హీరో నాగశౌర్య మైక్ తీసుకుని ఆ కార్యక్రమానికి యాంకర్, గెస్ట్‌ సుమనే అని చెప్పి ఆమెకు షాకిచ్చాడు. ఆయన మాట్లాడుతూ..‘‘ ఎన్నో సినిమాల మంచి కోరి, కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ స్టార్ అయ్యేంత వరకు ప్రతి మూవీ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించి ఎంటర్‌టైన్ చేస్తుంది. అంతేకాకుండా అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకునే సుమ గారి అంత మంచి చీఫ్ గెస్ట్‌ ఇంకెవ్వరూ ఉండరు. ఆవిడే మా చీఫ్ గెస్ట్ అని ప్రకటించాడు. తాను మాట్లాడిన తర్వాత కచ్చితంగా సుమ మాట్లాడాలని.. లేకపోతే తామెవ్వరం వేదిక మీద నుంచి కదలమని స్పష్టం చేశారు. అది విన్న సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. తనను చీఫ్ గెస్ట్‌గా పిలిచిన సంగతి తనకే తెలీదని సరదాగా అన్నారు.

Also Read: స్టార్ హీరో ధనుష్‌ని బ్యాన్ చేయనున్న కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ.. ఎందుకో తెలుసా?



Next Story