vishwak sen పై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన హీరో అర్జున్

by Disha Web Desk 17 |
vishwak sen పై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన హీరో అర్జున్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా 'ఓరి దేవుడా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్యను విశ్వక్ సేన్‌తో సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

కానీ అసలు విషయం ఏంటి అంటే, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నటించనని విశ్వక్ తప్పుకున్నట్టు సమాచారం. కానీ ఇలా అగ్రిమెంట్ కుదిరిన తర్వాత విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అర్జున్ తనపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి గల కారణం ఏంటి? అసలు వీరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది, విషయాలు తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం విశ్వక్ మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే వార్త మాత్రం, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన అర్జున్.. విశ్వక్ తమను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని తెలిపాడు.

Next Story