Alia Bhatt: హాలీవుడ్ ఫిల్మ్ టీజర్.. విలన్‌గా బెస్ట్ ఇచ్చిపడేసింది...

by Disha Web Desk 9 |
Alia Bhatt: హాలీవుడ్ ఫిల్మ్ టీజర్.. విలన్‌గా బెస్ట్ ఇచ్చిపడేసింది...
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కెరీర్ స్టార్టింగ్ నుంచి గంగూబాయి కతియావాడి వరకు తన యాక్టింగ్ గ్రాఫ్‌ను పెంచుతూనే వచ్చింది. తన నటనతో బీటౌన్‌ను ఏలేసింది కూడా. అయితే ఇప్పుడు హాలీవుడ్‌ను రూల్ చేసే టైమ్ వచ్చిందంటున్నారు అభిమానులు. ఆమె నటించిన ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.. అభినందించకుండా ఉండలేకపోతున్నారు. పైగా నెగెటివ్ రోల్‌లో ప్రత్యక్షమై షాక్ ఇవ్వడమే కాకుండా గాల్ గాడోట్, జామీ డోర్నన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ పక్కన మరో పవర్ హౌజ్‌గా మెరవడాన్ని కొనియాడుతున్నారు. కేయా ధావన్ పాత్రలో కనిపించిన అలియ.. ఫ్యూచర్‌ను ప్రెడిక్ట్ చేసే స్ట్రాంగ్ ఏఐ టూల్ ‘హార్ట్’ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి:

పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ రాసిపెట్టి ఉండాలిగా : కంగనా రనౌత్

Next Story

Most Viewed