- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతను నన్ను బట్టలు విప్పి నగ్నంగా కనిపించాలన్నాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి
కమెడియన్ జానీ లివర్ కూతురుగా జామీ(Jamie Lever) ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: కమెడియన్ జానీ లివర్ కూతురుగా జామీ(Jamie Lever) ఇండస్ట్రీకి పరిచయం అయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హిందీలో హౌస్‌ఫుల్-4(Housefull-4), కిస్ కిస్కో ప్యార్ కరూన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ది జామీ లివర్ షో పేరుతో రాబోతున్న కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించనుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జామీ తనకు ఎదురైన ఓ చేధు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. షెడ్యూల్ చేసిన సమయంలో, నేను అడిషన్‌కు వెళ్లాను. దీంతో దర్శకుడు నాతో నేరుగా మాట్లాడతారని నాకు సమాచారం చెప్పారు. ఒక రోజు నేను డైరెక్టర్‌కు వీడియో కాల్ చేశాను. కానీ అతను మాత్రం వీడియోను ఆన్ చేయలేకపోయాడు.
అతను ఇలా అన్నాడు, 'ఇది మేము నటీనటులను ఎంపిక చేస్తున్న అంతర్జాతీయ చిత్రం. మీరు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారు. కానీ మనం కొన్ని విషయాలను పరీక్షించాలి అన్నారు. నేను ఒక బోల్డ్ పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ఇందులో కామెడీ ఉండదని ఆయన నాకు చెప్పారు.అప్పుడు కొత్త అవకాశాల కోసం ఆతృతగా ఉన్నాను. అందుకే డైరెక్టర్‌ను ఏమి చేయాలో అడిగాను. ఆయన ఇలా అన్నాడు. ‘మీ ముందు 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారని ఊహించుకోండి, మీరు అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి, ఇద్దరి మధ్య సన్నిహిత సన్నివేశం ఉంది అని చెప్పారు.
స్కిప్ట్ ప్రకారం న్యూడ్‌గా కూడా కనిపించాలని చెప్పారు. దీంతో నేను అసౌకర్యంగా, అనుచితంగా ఉందని చెప్పాను. నాకు అతను అలా అనడంతోనే డౌట్ వచ్చింది. నేను వెంటనే నా వీడియోను ఆపివేసాను. అప్పుడే ఇది ఒక పెద్ద స్కామ్ అని నాకు అర్థమైంది. ఒకవేళ నేను అడిషన్ చేసి ఉంటే ఇబ్బంది పడేదాన్ని. అలా జరగనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిత్యం పలువురు నటీనటులు ఈ విషయంపై షాకింగ్ నిజాలు రివీల్ చేశారు. ఇక ఇప్పుడు జామీ కూడా అలాంటి అనుభవం ఎదురైనట్లు తెలపడంతో అంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.






