ఆయన నాలోని సరికొత్త కోణాలు చూపించారు.. ఇదొక అద్భుతమైన అనుభవమంటూ శార్వరి వాఘ్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఇంతియాజ్ సర్ ప్రతి సీన్ వెనుక ఉండే ఎమోషన్‌ను ఎంతో స్పష్టంగా వివరిస్తారు. నాలో ఉన్న సరికొత్త కోణాలను ఆయన నాకు పరిచయం చేశారు.

ఆయన నాలోని సరికొత్త  కోణాలు చూపించారు.. ఇదొక అద్భుతమైన అనుభవమంటూ శార్వరి వాఘ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శార్వరి వాఘ్ 'మై వాపస్ ఆవుంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, శాార్వరి ఈ సినిమాలోని 'మస్కారా' పాట చిత్రీకరణకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ, దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శార్వరి ఈ పాటలోని ఫీలింగ్ గురించి చెబుతూ, 'కిస్-మిస్ యారా' అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఒక కల్పిత పదం అయినప్పటికీ, మొదటిసారి ప్రేమలో పడినప్పుడు మనసులో కలిగే ఆ మధురమైన అలజడిని ఇది అద్భుతంగా వివరిస్తుందని ఆమె అన్నారు. సినిమాలో తన పాత్ర అయిన 'జియా' జీవితంలో ఈ ఎమోషన్ చాలా కీలకం అని, ఆ భావాలను పండించడంలో ఇంతియాజ్ అలీ తనకు ఎంతో సహాయం చేశారని శార్వరి పేర్కొన్నారు.

దర్శకుడు ఇంతియాజ్ అలీ గురించి శార్వరి ఎంతో గొప్పగా రాశారు. "ఇంతియాజ్ సర్ ప్రతి సీన్ వెనుక ఉండే ఎమోషన్‌ను ఎంతో స్పష్టంగా వివరిస్తారు. నాలో ఉన్న సరికొత్త కోణాలను ఆయన నాకు పరిచయం చేశారు. షూటింగ్ సమయంలో ఇంతియాజ్ చూపించిన ఓపిక, నమ్మకం, ప్రేమ నన్ను ఒక మంచి నటిగా తీర్చిదిద్దాయి. ఆయన కథ చెప్పే విధానాన్ని గమనించడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను" అని ఆమె తన నోట్‌లో రాశారు. ఈ ప్రయాణం తన జీవితంలో మర్చిపోలేనిదని, 'జియా'గా మారడంలో ఆయన ప్రోత్సాహం మరువలేనిదని ఆమె ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ సినిమా నేపథ్యం గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ఊహాజనిత కథ కాదని, దేశ విభజన సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఆ భయంకరమైన రోజుల్లో కూడా ప్రజల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, పర్సనల్ బాండింగ్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుదని అన్నారు. శార్వరి షేర్ చేసిన ఈ ఫోటోలు, ఆమె రాసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Next Story