- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అతను నా జీవితంలో చాలా ముఖ్యమైనవాడు’.. స్టార్ హీరోపై నిధి అగర్వాల్ కామెంట్స్!
కొంత గ్యాప్ తర్వాత నిధి అగర్వాల్(Nidhi Agarwal) తిరిగి బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆశతో ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: కొంత గ్యాప్ తర్వాత నిధి అగర్వాల్(Nidhi Agarwal) తిరిగి బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆశతో ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, విడుదలైన తర్వాత ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే దక్కించుకుంది. ఈ చిత్రం కోసం నిధి అగర్వాల్ ఎంతో కష్టపడినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ ఆశలన్నీ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’(the raja saab) మీదే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ప్రభాస్(Prabhas) సరసన నిధి రొమాన్స్ చేయడం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్, ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ‘‘ఆయన చాలా సింపుల్‌గా, కేర్ తీసుకునే వ్యక్తి.
అతను చాలా స్పెషల్
సెట్స్‌లో అందరినీ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. బంగారం లాంటి మనిషి. భారతదేశపు అతిపెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. పరిశ్రమలోనే కాదు, నా జీవితంలోనే చూసిన అత్యంత మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నా జీవితంలో చాలా ముఖ్యమైనవాడు. ప్రభాస్ ఒక చెట్టు లాంటివారు. వేర్లు ఎంత లోతుగా ఉంటే, అంత ఎత్తుకు ఎదుగుతారు. అలా ఆయన కూడా అంతే’’ అని చెప్పింది. అలాగే నిర్మాణ సంస్థ గురించి మాట్లాడుతూ.. ఇది నా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని నిధి అగర్వాల్ వెల్లడించింది. ముఖ్యంగా ఇందులో నిర్మించిన ప్యాలెస్ సెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెప్పింది. ఆ సెట్స్‌లోకి అడుగుపెట్టగానే సినిమా స్థాయి అర్థమవుతుందని, ప్రతి చిన్న డీటెయిల్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొంది. మొదటి రోజు నుంచే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి విషయంలోనూ రాజీ పడలేదని నిధి స్పష్టం చేసింది. క్వాలిటీ, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు పాటించారని తెలిపింది. ప్రేక్షకులకు ఒక గ్రాండ్ అనుభూతిని ఇవ్వాలన్నదే వారి లక్ష్యమని చెప్పింది.






