హీరో అవ్వడం కోసం అక్కడ సర్జరీ చేయించుకున్న నందమూరి వారసుడు

by Disha Web Desk 9 |
హీరో అవ్వడం కోసం అక్కడ సర్జరీ చేయించుకున్న నందమూరి వారసుడు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ గత సంవత్సరమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని నెట్టింట వార్తలు వినిపించాయి. తండ్రి కొడుకుల దర్శకత్వంలోనే ‘ఆదిత్య 369’ సిక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చిత్రంతో తెరపై మెరవనున్నారని టాక్ వచ్చింది. కానీ బాలయ్యకు జాతకాలపై ఎక్కువగా నమ్మకం ఉంటుంది. దీంతో వచ్చే ఏడాదే మోక్షాజ్ఞ సినిమాల్లోకి అడుగు పెడితే అతని దిశ తిరుగుతుందని, పరిశ్రమని ఏలే స్థాయికి వెళ్తాడనే ఉద్దేశంతో ఉన్నాడట. అయితే గతంలో మోక్షజ్ఞ బొద్దుగా ఉండేవాడు. తాజాగా ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘హీరో మెటీరియల్ తయారైపోయిందిగా, ఇదేంటి ఈ జూనియర్ బాలయ్య ఇలా అయిపోయాడు, హీరో కావడానికి సర్జజీ కానీ చేయించుకున్నాడట ఏంటి?, ఒక్కసారిగా ఇంత బరువు తగ్గడం ఏంటి? అంటూ పలు రకాలుగా మాట్లాడుతున్నారు.

Also Read: ‘రోడీస్’లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్‌గా నీర్జా.. బిచ్చగాళ్లుగా చూస్తున్నారంటూ ఆవేదన


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed