ఇప్పుడున్న జనరేషన్‌కు ఆయనే రోల్ మోడల్.. స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించిన ఐశ్వర్య రాజేష్

by Mallepaka Hamsa |

ఎంతమంది ఎన్ని మాటలన్నా అవన్నీ భరిస్తూ ముందుకు సాగుతారు. నిజంగా ఈ కాలం యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్

ఇప్పుడున్న జనరేషన్‌కు ఆయనే రోల్ మోడల్.. స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించిన ఐశ్వర్య రాజేష్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఈ అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల వెంకటేష్ సరసన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం తీరువీర్‌తో కలిసి ‘ఓ సుకుమారి’ అనే సినిమాలో నటిస్తూనే, చేతినిండా మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, తమిళ స్టార్ హీరో తళపతి విజయ్‌ గురించి ఐశ్వర్య చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ.. "విజయ్ సార్ ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ బయట చాలామంది ఆయన గురించి నెగటివ్‌గా మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తుంటారు.

అయినా సరే, ఆయన అవేమీ పట్టించుకోరు. తన పని మీద మాత్రమే దృష్టి పెడతారు" అని చెప్పుకొచ్చింది. విజయ్‌కి తన ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఐశ్వర్య వివరించింది. "ఆయనకు తన అభిమానులే ప్రపంచం. వారికి ఏది కావాలో, వారిని ఎలా సంతోషపెట్టాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఎంతమంది ఎన్ని మాటలన్నా అవన్నీ భరిస్తూ ముందుకు సాగుతారు. నిజంగా ఈ కాలం యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్" అని ఐశ్వర్య కొనియాడింది. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో, ఐశ్వర్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి, విమర్శలను పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు సాగిపోవడం అందరికీ స్ఫూర్తినిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Next Story