నా ఇన్స్పిరేషన్ ఆయనే..ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా: Niharika NM

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 14:42:46  IST  )

నిహారిక ఎన్‌ఎమ్(Niharika NM) ‘మిత్రమండలి’ (Mithra Mandali)సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.

నా ఇన్స్పిరేషన్ ఆయనే..ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా: Niharika NM
X

దిశ, సినిమా: నిహారిక ఎన్‌ఎమ్(Niharika NM) ‘మిత్రమండలి’ (Mithra Mandali)సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘మిత్రమండలి’ చిత్రానికి సంబంధించిన మూడో పాటను విడుదల చేశారు. బ్రహ్మానందం(Brahmanandam) ఫేమస్ డైలాగ్ ‘జంబర్ గింబర్ లాలా’ లిరిక్స్‌తో ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆ పాట లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిహారిక మాట్లాడుతూ..నేను రీల్స్ చేయడానికి కారణం బ్రహ్మానందం గారు.

నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. చిన్నప్పటి నుంచి బ్రహ్మానందం గారంటే ఇష్టం అని చెప్పేదాన్ని. నా డెబ్యూ సినిమాలో ఆయనతో నటించడం అదృష్టం గా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, నా దర్శకుడికి, నాతో నటించిన ప్రియదర్శికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా థియేటర్స్‌కు వచ్చి మా సినిమా చూసిన తర్వాత అరవండి’’ అని చెప్పుకొచ్చింది. కాగా, ఈ చిత్రంలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో విజయేందర్ ఎస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

Next Story