ఆయన నాలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నింపుతూ యువరాణిలా నిల్చో బెడుతున్నారు: రుక్మిణి వసంత్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

ఆయన నాలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నింపుతూ యువరాణిలా నిల్చో బెడుతున్నారు: రుక్మిణి వసంత్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార చాప్టర్:1’(Kantara Chapter:1). రిషబ్ శెట్టి స్వయం దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేయగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రుక్మిణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మూవీ టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిషబ్ శెట్టి మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఇలాంటి గొప్ప పాన్ ఇండియా మూవీలో అవకాశం అందుకున్నాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

చాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి(Rishabh Shetty)కి కృతజ్ఞతలు తెలియజేయడానికి నా దగ్గర పదాలు లేవు. ఆయన ఎప్పటికప్పుడు నాలో కొత్తదనాన్ని నింపుతూ.. నన్ను ప్రోత్సహిస్తూ ఇప్పుడు మీ ముందు యువరాణిలా నిల్చోబెడుతున్నారు. దీనికి ఆయనకు నేను రుణపడి ఉంటా. షూటింగ్ సమయంలో రిషబ్ శెట్టి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ‘కాంతార’ నాకు మరో జీవితాన్ని ప్రసాదిస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది.

Next Story