ఇండస్ట్రీలో అతనొక్కడే అసలైన మొగాడు.. మహిళలను కన్నెత్తి కూడా చూడడు: Kangana Ranaut

by Phanindra |   (  Updated:2023-08-19 10:08:41  IST  )

స్టార్ నటి కంగనా రనౌత్ సహనటుడు జాన్ అబ్రహం క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించింది

ఇండస్ట్రీలో అతనొక్కడే అసలైన మొగాడు.. మహిళలను కన్నెత్తి కూడా చూడడు: Kangana Ranaut
X

దిశ, సినిమా: స్టార్ నటి కంగనా రనౌత్ సహనటుడు జాన్ అబ్రహం క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో జాన్ ఫొటోను షేర్ చేస్తూ ఎంతోమంది నెగెటీవ్ పీపుల్ కలిగివున్న సినీ పరిశ్రమలో జాన్ అబ్రహం వంటి దయగల వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పింది. ‘జాన్ నిజాయితిగల నటుడు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను తన సొంత కుటుంబంలా చూస్తాడు. మహిళలను అసలే వేధించడు. పీఆర్, గ్రూపిజం గురించి పట్టించుకోడు. ప్రతికూల వ్యక్తుల గురించి మాత్రమే కాదు ఇలాంటి వారిని కూడా ఎప్పటికీ మనం మరచిపోకూడదు. నేను జాన్‌తో కలిసి పనిచేసిన అనుభవంతో చెబుతున్నా. అతనితో స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పదాలు లేవు. చాలా మందికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే అతనిపై ప్రశంసలు కురిపించేందుకు మీడియాకు డబ్బు చెల్లించడు. అతను కేవలం సెల్ఫ్ మేడ్ మ్యాన్ మాత్రమే కాదు అన్ని విధాలా విజయవంతమైన వ్యక్తి. అద్భుతమైన మనిషి. లవ్ యు జాన్’ అంటై తనదైన స్టైల్‌లో పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: హీరోయిన్ శ్రియ న్యూ ఫొటో షూట్.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదా అంటూ ట్రోల్స్

Next Story