నాతో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు : శృతిహాసన్..

by Dishafeatures1 |
నాతో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు : శృతిహాసన్..
X

దిశ, సినిమా: స్టార్‌కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ మొదటగా ‘వీర సింహా రెడ్డి’ మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘వాల్టేరు వీరయ్య, ‘హాయ్ నాన్న’, ‘సలార్’ వంటి సినిమాలో నటించిన ఈ బ్యూటీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్‌ను సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ శృతి ‘లియో’ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో కలిసి ఇనిమోల్ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ ఆల్బమ్ గురించి శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.. ‘ఇనిమోల్ మ్యూజిక్ ఆల్బమ్‌ గురించి లోకేష్‌ను సంప్రదించినప్పుడు మొదట ఆయన ఇందులో నటించేందుకు నిరాకరించాడు. కానీ ఆ తర్వాత ఈ సాంగ్ కాన్సెప్ట్ మొత్తం విని అప్పుడు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.



Next Story

Most Viewed